
మహేష్ బాబు సరసన ‘నటించిన ‘1 నేన్నోకిడినే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులని ఆక్కట్టుకున్న నటి కృతి సనన్. అలాగే టైగర్ శ్రోఫ్ఫ్ సరసన ‘హీరోపంతి’ వంటి పెద్ద చిత్రంలో నటించింది.
ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. చాలా మంది హీరోయిన్లు ఒకసారి హిందీ చిత్రంలో నటిస్తే ఇంక దక్షిణాది చిత్రాల పై ఆశక్తి చూపించరు. అయితే కృతి మాత్రం అందుకు భిన్నంగా బాలీవుడ్ ని దక్షిణాది ని బాలన్స్ చేస్తుంది”. దక్షిణాది లోని చిత్ర పరిశ్రమ గత కొన్ని యేళ్ళు గా ఎంతో అభివృద్ది చెందింది. నేను ఒక చిత్రంలో నటించాను నాకు దక్షిణాదిలో కొనసాగడానికి ఏం అభ్యంతరం లేదు.” అని కృతి తెలిపింది.
ఇంకా మాట్లాడుతూ “దక్షిణాది లో కొనసాగాలంటే బొద్దుగా వుండాల్సిన అవసరం లేదు. నన్ను నా చిత్రానికి బరువు పెరగమని ఎవరు అడగలేదు’ అని తెలిపింది. ఢిల్లీ లో పుట్టిన ఈ నటి ముంబై లో ఒక ఇంటి ని కొనబోతుంది. ఆమె చిత్ర పరిశ్రమ లో తన కలలు నిజం చేసుకోవాలని ఆశిద్దాం.