
రాకుల్ ప్రీత్ సింగ్ కి వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల మీద సినిమాలకు సంతకం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ భామ. ప్రస్తుతం ఈ అమ్మడికి ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం
తాజా కధనాల ప్రకారం ఈ భామ అప్పట్లో ‘షోలే’ వంటి సంచలనాత్మక సినిమా తీసిన రమేష్ సిప్పీ దర్శకత్వంలో నటించనుందట. హేమా మాలిని రాకుల్ కి తల్లి పాత్ర పోషించనుంది. రాజ్ కుమార్ రావు హీరో
ప్రస్తుతం రాకుల్ గోపీచంద్ సరసన మరియు మంచు మనోజ్ నటిస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమాలో నటిస్తుంది