
శ్రుతి హాసన్ సోయగాలకు తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రమె కాదు, యావత్ భారతదేశంలో సినిమా అభిమానులు ఫిదా అయ్యారు. అల్ ఓవర్ ఇండియాలో సెక్సియస్ట్ విమెన్ ఎవరు అని ఎఫ్.హెచ్.యం.మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో శ్రుతి హాసన్ 5వ స్థానం సొంతం చేసుకుంది. టాప్ ఫైవ్ హీరోయిన్ల లిస్టులో స్థానం పొందిన ఏకైక సౌత్ హీరోయిన్ శృతి హాసన్ కావడం విశేషం. మొదటి నాలుగు స్థానాలలో హిందీ హీరోయిన్లు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, నర్గిస్ ఫక్రిలు ఉన్నారు.
కెరీర్ ఆరంభంలో శ్రుతిని పరాజయాలే పలకరించాయి. ‘గబ్బర్ సింగ్’తో అమ్మడి దశ తిరిగింది. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవకాశమే రాలేదు. బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం సినిమాలతో హిట్ సినిమా హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ఇటివల శృతి హాసన్ ఎక్కువగా అందం, అభినయం రెండిటి సమప్రాధాన్యం కల పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తుంది.