ఆగష్టులో నార్వే వెళ్లనున్న ‘ఆగడు’ టీం

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ‘ఆగడు’. ఇటీవలే బళ్ళారి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ హైదరాబాద్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు శృతి హాసన్ పై వచ్చే ఓ స్పెషల్ సాంగ్ ని కూడా షూట్ చేయనున్నారు.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఈ చిత్ర టీం నార్వే వెళ్లనున్నారు. ఆగష్టు 12 నుండి నార్వేలో మహేష్ బాబు – తమన్నాలపై ఓ పాటని షూట్ చేయనున్నారు. అక్కడి నుంచి వచ్చాక ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి సెప్టెంబర్ 19న సినిమా రిలీజ్ చేయడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యడం కోసం మహేష్ బాబు గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు రాయలసీయ యాసలో మాట్లాడి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనున్నాడు.

Exit mobile version