
ఈ మధ్యకాలంలో తెలుగులో వస్తున్న కొంతమంది డైరెక్టర్స్ తమ సినిమాలకు కొత్త రకమైన టైటిల్స్ ఎంచుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలా రానున్న మరో సినిమా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ కారక్రమానికి పలువుర్ ప్రముఖులు హాజరు కానున్నారు.
ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, నందు మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ నెగటివ్ పాత్రలో కనిపించనుంది. ఈ టైటిల్ లో ఉన్నట్టుగానే కిడ్నాప్ చుట్టూ తిరిగితుంది. దానికి కామెడీ టచ్ ని కూడా జత చేసారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి చందు నిర్మాత. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.