సెకండ్ షెడ్యూల్లో రామ్ ‘పండగ చేస్కో’.

ram1

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘పండగ చేస్కో’. ఈ చిత్రంలో రామ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజా(సెకండ్) షెడ్యూల్ నేడు ప్రారంభం అయింది. రామ్, రాకుల్ ప్రీత్ సింగ్ లపై కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. బలుపు వంటి విజయవంతమైన చిత్రం తర్వాత గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులలో క్రేజ్ బాగుంది.

Exit mobile version