స్టూడియో గ్రీన్ ప్రమోషన్స్ మిస్ అవుతున్న సూర్య

Surya
ప్రస్తుతం ఉన్న సినీ ప్రపంచంలో సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించాలి అంటే ఆ సినిమా పబ్లిసిటీ మరియు మార్కెటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాయింట్ ని తూచా తప్పకుండా స్టూడియో గ్రీన్ వారు పాటిస్తుంటారు. మామూలుగా తెలుగులో విడుదలయ్యే సూర్య, కార్తి సినిమాలకు భారీగా ప్రమోషన్స్ చేస్తారు.

సూర్య, కార్తిలకు తెలుగు ఇంత మార్కెట్ ఉండటానికి ప్రధాన కారణం అదే.. కానీ ఈ సారి సూర్య తన రాబోతున్న ‘సికందర్’ సినిమాకి స్టూడియో గ్రీన్ ప్రమోషన్స్ మిస్ అవుతున్నాడు. ఈ సినిమా తెలుగు సినిమా రైట్స్ ని ఈ సారి లగడపాటి శ్రీధర్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి పబ్లిసిటీ డీసెంట్ గానే ఉన్నప్పటికీ సూర్య గత సినిమాల రేంజ్ లలో మాత్రం లేదు. అలాగే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉండడం వలన పబ్లిసిటీ ముందు ముందు బాగా చేసే అవకాశం ఉండవచ్చు.

Exit mobile version