
దర్శకరత్న దాసరి నారాయణరావు తన 151వ సినిమాకి దర్శకత్వం చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా ఆయన తమిళంలో హిట్ అయిన ‘మంజపై’ అనే సినిమాని రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా కోసం దాసరి మంచు విష్ణుని హీరోగా, కేథరిన్ ట్రేసని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమా దికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తాత – మనవడు మధ్య జరిగే కథాంశంతో తెరకెక్కనుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో దాసరి చేసిన ‘తాత – మనవడు’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విష్ణుకి తాతగా ఎవరు కనిపిస్తారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా ప్రారంభం రోజు అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.