రెగ్యులర్ షూటింగ్లో చైతు, సుదీర్ వర్మల సినిమా.

naga-chaitanya
‘స్వామి రా రా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు సుదీర్ వర్మ. తోలి చిత్రంతోనే తన సత్తా చాటిన సుదీర్ వర్మ, రెండవ చిత్రంతో నాగ చైతన్యను దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి సనన్ నటిస్తుంది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి ప్రారంభం అయ్యింది. నాగ చైతన్య, కృతి సనన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత శ్రీ వెంకటేశ్వరా సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. సన్నీ ఎంఅర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version