రభసలో పాట పాడిన ‘ఎన్టీఆర్’

NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి పాట పాడాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘రభస’. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రాకాసి.. రాకాసి.. అనే పాటను ఎన్టీఆర్ పాడాడు. గతంలో ‘యమదొంగ’ చిత్రంలో ‘ఓలమ్మి తిక్క రేగిందా.. ‘, అదుర్స్ చిత్రంలో ‘చారి..’ & ‘కంత్రి’ చిత్రంలో ‘123 నేనొక కంత్రి..’ పాటలను పాడాడు. తమన్ సంగీతంలో పాడడం మాత్రం ఇదే తొలిసారి.

ఎన్టీఆర్ పాట పాడడంతో ఆడియోపై అంచనాలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. త్వరలో ఆడియో రిలీజ్ డేట్ వెల్లడిస్తారు. సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version