
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి గ్లామరస్ గర్ల్ శృతి హాసన్ ఒక ప్రత్యెక గీతంలో డాన్సు చేయనున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో జూలై 25 నుండి ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరగనుంది. ‘ఆగడు’ స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ చూడాలంటె సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబుపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ‘ఆగడు’ తమన్ కు 50వ సినిమా. అందుకే ఈ సినిమాపై తమన్ ప్రత్యెక శ్రద్ధ వహిస్తున్నాడు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తవగానే మూవీ యూనిట్ నార్వేకి షిఫ్ట్ అవుతుంది. మహేశ్, తమన్నాలపై 2 పాటలను తెరకేక్కిస్తారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసి సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నారు. ఆడియో ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.