తిరువీర్ హీరోగా ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా.. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన హీరో అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “నేను ఈ ఫంక్షన్ కు రావడానికి కారణం తిరువీర్. నా వైఫ్ ఆయనకు పెద్ద ఫ్యాన్. ‘మసూద’ సినిమా నుంచే తను తిరువీర్ కి ఫ్యాన్ అయింది. మా ఇంట్లో ఎప్పుడూ వినబడే డైలాగ్ ‘సమోసా తింటావా శిరీషా’. మేము ఇంట్లో సరదాగా ఆ డైలాగ్ తో మాట్లాడుకుంటాం. ఇక ఈ సినిమా దర్శకుడు ఎస్.పి. దుర్గ నరేష్ తో సినిమా చేస్తాను. ఆయనకు ఖర్చీప్ కాదు, ఏకంగా టవల్ కూడా వేస్తున్నాను’ అని నరేష్ చెప్పుకొచ్చారు.
