
కాజల్ అగర్వాల్ కొంతకాలంగా కోలీవుడ్ కు దూరంగా వుంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక పెద్ద చిత్రం తో కంబాక్ ఇవ్వనుంది. ఈ వార్త నిజమైతే కాజల్ ధనుష్ సరసన తొలిసారి నటించనుంది.
బాలాజీ మోహన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సివుంది. ధనుష్ ప్రస్తుతం ‘శామితాబ్’ అనే హిందీ చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నాడు. ‘అనేగాన్’ చిత్రం కూడా విడుదల కానుంది.
‘లవ్ ఫెయిల్యూర్’ దర్శకుడు బాలాజీ రొమాంటిక్ కథలు బాగా తీస్తాడనేపేరుంది. ఈ చిత్రం ద్వారా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేయనున్నాడు. నిన్న విడుదల అయిన ధనుష్ ‘వి. ఐ. పి’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనని రాబట్టుకుంటుంది.