మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. ఐతే, ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు చిరంజీవి – సచిన్ ఖేడ్కర్ మధ్య ఓ సీన్ ఉంటుంది. ఈ సీన్ లో ‘వాళ్లు డబ్బున్న వాళ్లయ్యా.. ఇన్సల్ట్ చేస్తే వెళ్లి పోతారు’ అంటూ మోహన్ బాబు మాడ్యులేషన్ లో మెగాస్టార్ ఓ డైలాగ్ చెబుతారు. అయితే, మోహన్ బాబుని ఇమిటేట్ చేయాలనే ఐడియా చిరంజీవిదే అనే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుకి – మెగాస్టార్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
ఆ కారణంగానే చిరు ఆయనను ఇమిటేట్ చేశారని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. సంక్రాంతికి స్పెషల్ గా విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూళ్లును రాబట్టింది. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి.
