
చాలా మంది అగ్రనటులకు ముక్కుమీద కోపం వుంటుందని, పబ్లిక్ తాకిడిని తట్టుకుంటూ లక్షల్లో వుండే అభిమానులను, వారి ప్రేమను స్వీకరించడం కాస్త కష్టతరమైన బాధ్యతే
కానీ వీళ్ళదారి సాదా దారి అయితే తన దారి రహదారి అని సూపర్ స్టార్ మరోసారి నిరువుపించాడు. ఆయనని చూడడానికి వచ్చినవారితో రజిని మసులుకున్న తీరు అసామాన్యం
వచ్చిన ప్రతీ అభిమానితో ఫోటో దిగుతూ తనకున్న ఓర్పును ప్రజలకు చూపించాడు. లింగా సినిమా షూటింగ్లో ఈ సంఘటన బృందాన్ని ఆశ్చర్యపరిచిందని సమాచారం. మనవాళ్ళు రజినిని చూసి నేర్చుకుంటే మంచిదని పలువురి అభిప్రాయం