శృతి హాసన్ పాడిన పాటకు సమంత డాన్స్ చేయడానికి రెడీ అవుతుందా..? అవుననే అంటుంది చెన్నై మీడియా. శృతి హాసన్ గ్లామరస్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా. గతంలో పలు సినిమాలలో పాటలు పాడింది. మహేష్ బాబు ‘ఆగడు’లో తను నటిస్తున్న స్పెషల్ సాంగును తానే స్వయంగా పాడింది. తాజాగా తమిళ సినిమా ‘కత్తి’ కోసం మరోసారి గొంతు సరిచేసుకుందని టాక్.
తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న సినిమా ‘కత్తి’. ఈ సినిమాకు యువ సంగీత సంచలనం ‘కొలవేరి డీ’ ఫేం అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్, శృతి హాసన్ లు మంచి స్నేహితులు. అనిరుధ్ కోరిక మేరకు శృతి హాసన్ ‘కత్తి’ సినిమాలో సాంగ్ పాడిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ వార్తలలో నిజం ఎంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
