త్వరలో నార్వే వెళ్లనున్న మహేష్ ‘ఆగడు’ టీం

Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ వారంతో ఈ క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. క్లైమాక్స్ షూటింగ్ పూర్తవగానే ఈ చిత్ర టీం ఆగష్టు 2వ వారంలో ఓ సాంగ్ షూట్ కోసం నార్వే వెళ్లనున్నారు. ఆ సాంగ్ తో షూటింగ్ దాదాపు పూర్తవుతుంది.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 19న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ స్పెషల్ సాంగ్ ని కూడా ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ స్పెషల్ సెట్లో షూట్ చేసేసారు. మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version