మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమా డ్రాగన్ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ అలా నెమ్మదిగా సాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఎదురు చూపులు కూడా మరింత ఎక్కువ అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ రోల్ పై క్రేజీ బజ్ ఇప్పుడు బయటకి వచ్చింది.
మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ మొదట ఫిక్స్ అయ్యాడు కానీ ఇప్పుడు ఈ రేస్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో వచ్చినట్టు తెలుస్తోంది. మరి అతను కూడా ఎవరో కాదు టాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ అట. సో ఈ బజ్ గాని నిజం అయితే నార్త్ మార్కెట్ లో కూడా ఈ సినిమాకి మంచి బూస్టప్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన తోనే తెలియలి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
