‘సికందర్’ ఓపెనింగ్స్ బాగున్నాయి..!

Sikandar
సింగం సూర్య, సమంత జంటగా నటించిన సినిమా ‘సికందర్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించినా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సూర్య స్టైలిష్ యాక్టింగ్, సమంత గ్లామర్ పెర్ఫార్మన్స్(బికినీ)కి బి. సి సెంటర్ ప్రేక్షకుల నుండి అద్బుతమైన స్పందన లభించింది. లింగుస్వామికి గత సినిమాలు తెలుగులో హిట్ కావడం, అతనికి కూడా కొంత మార్కెట్ ఉండడంతో సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగున్నాయి.

సూర్య సినిమాలలో ‘సికందర్’ ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాదించిన చిత్రంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నైజాం ఏరియాలో ఫస్ట్ డే సుమారు కోటిన్నర కలెక్ట్ చేసిందని సమాచారం. అలాగే కృష్ణలో కూడా సినిమాకు మంచి స్పందన లభించింది. శుక్రవారం 30 లక్షల వరకు వసూలు చేసిందని అంటున్నారు. సమంత ఇప్పటివరకు కనపడనంత గ్లామరస్ గా ఈ సినిమాలో ఉందని టాక్ రావడం సినిమాకు ప్లస్ అయ్యింది. వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version