
సూపర్ స్టార్ రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా సినిమా ‘లింగా’. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ నేడు కర్ణాటకలో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ 40 రోజుల పాటు కొనసాగనుంది. రజినీకాంత్ 21 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసిన దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈ షెడ్యూల్ తో టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రజిని బర్త్ డే కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘రోబో’ తర్వాత రజిని ‘కొచ్చాడియాన్’లో నటించారు. మోషన్ కాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కిన ఆ సినిమా అభిమానులకు కిక్ ఇవ్వలేదు. అందువల్ల ‘లింగా’పై భారి అంచనాలు నెలకొన్నాయి. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.