ప్రముఖ హీరోయిన్ ఛార్మి ఎక్కిన ఫ్లైట్ కు సమస్య తలెత్తడంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ రోజు ఉదయం వైజాగ్ వెళ్ళడం కోసం ఇండిగో ఫ్లైట్ లో పయనమయ్యారు ఛార్మి. కాసేపట్లో లాండింగ్ అవుతుందనగా… ప్రమాదం ఎదురైంది.
ఒక్కసారిగా 100 అడుగుల కిందకు ఫ్లైట్ పడిపోయినట్టు అనిపించింది. చాలా భయం వేసింది. నా టీ కింద పడింది. ప్రయాణికులు అందరూ కింద పడిపోయారు. ఇదే చివరి రోజు అనుకున్నాం. మరోసారి ఫ్లైట్ లో కుదుపులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రాణాలు పోయాయి అనుకున్నా. ఇదే చివరి శ్వాస అని ఫీల్ అయ్యాను. కాని ఎం కాలేదు. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. ఇంకా షాక్ లోనుండి తేరుకోలేదు. నెలపై దిగాం అనే విషయాని నమ్మలేకపోతున్నాను. అని సోషల్ మీడియా తన భయానక అనుభవాన్ని పంచుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.
ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితాన్ని పూర్తిగా ఆశ్వాదించాలి అని చెప్పింది.
