రాజమౌళిపై ప్రశంశలు కురిపించిన అడవి శేష్.!

rajamouli_adiviseshu

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్టర్ అయినా తన సినిమా కోసం రాత్రింబవళ్ళు ఒక అసిస్టెంట్ లా కష్టపడతారని ఆయనతో పనిచేసిన చాలా మంది ఇప్పటికే పలు సార్లు చెప్పారు. తాజాగా ఇదే అనుభవాన్ని అడవి శేష్ కూడా ఎదుర్కొన్నాడు.

‘బాహుబలి’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అడవి శేష్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ‘రాజమౌళి గారికి అలుపెరగని, అస్సలు డ్రాప్ అవ్వని ఎనర్జీ లెవల్స్ ఉన్నాయి. ఆయన వర్క్ చూస్తే మీరు కోడా ఎంతో ఉత్తేజంగా మరింత ఎనర్జీతో పనిచేస్తారని’ అన్నాడు. ప్రస్తుతం ‘బాహుబలి’ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, అనుష్క, సత్యరాజ్, అడవి శేష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు..

Exit mobile version