
సినిమాలలో బ్రాండింగ్ చేయడం ఇంగ్లీష్ మరియు బాలీవుడ్ చిత్రాలలో చాలా సాధారణంగా కనపడే విషయం. కొన్ని సంస్థలు తమ పేరు ని కొన్ని పెద్ద చిత్రాలలో చూసుకోవడానికి భారీగా ఖర్చుపెడతాయి.
బ్రాండింగ్ ఇప్పటికే కొన్ని భారీ తెలుగు చిత్రాలలో కొంతవరకు కనపడింది. రానున్న రోజులలో బ్రాండింగ్ తెలుగు చిత్రాలలో పుంజుకొనుంది. తెలుగు చిత్రాలకు ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న ఆదరణ వల్ల చాలా సంస్థలు టాలీవుడ్ లో బ్రాండింగ్ పై ఆశక్తి కనబరుస్తున్నాయి. ఈ ట్రెండ్ ని తెలుగు నిర్మాతలు దర్శకులు ఆహ్వానిస్తున్నారు.
రానున్న రోజులలో తెలుగు చిత్రాలలో బ్రాండింగ్ చూడడానికి వేచి చూడాల్సిందే.