లిప్ లాక్ కి నో చెప్పిన నందిత

Nanditha

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం ఈ మధ్య చాలా తక్కువగా జరుగుతోంది. అలా వచ్చిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో నందిత ఒకరు. ఈ యంగ్ హీరోయిన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నందిత నటించిన ‘లవర్స్’ సినిమా గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

మాములుగా తెలుగమ్మాయిలు అంటే గ్లామర్ కి దూరంగా ఉంటారు. గ్లామర్ విషయంలో మీ పరిమితులు ఏమిటని నందితని అడిగితే ‘ఎప్పుడూ హద్దుల్లో ఉంటూ అందంగా, గ్లామర్ గా కనిపించడానికి నేను సిద్దమే. కానీ లిప్ కిస్ లు, భారీ స్కిన్ షోకి మాత్రం నేను దూరం. ఇప్పుడున్న గ్లామర్ ప్రపంచంలో ఇండస్ట్రీలో ఉన్న గ్లామరస్ తారాలకి పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రం గ్లామరస్ గా అయినా కనపడాలి కదా అని’ తెలిపింది. లవర్స్ సినిమా కాకుండా నందిత నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘లవ్ ఇన్ లండన్’ సినిమాలు త్వరలో విడుదలకు సిద్దమవుతున్నాయి.

Exit mobile version