ఎన్.టి.ఆర్ ‘రభస’కి ‘ఏ’ సర్టిఫికేట్

Rabhasa-poster
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రభస’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 29న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఎన్.టి.ఆర్ ‘రభస’ సినిమాలో రిస్క్ తో కూడుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ చేసారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అవుతాయని అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో బ్రహ్మానందం – ఎన్.టి.ఆర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు.

ఎన్.టి.ఆర్ నుండి తన అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు కుటుంబ విలువలు, సెంటిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉండనున్నాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version