సెప్టెంబర్ 15న విక్రమ్ ‘ఐ’ ఆడియో..?

Vikram

ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘ఐ’ ఆడియో సెప్టెంబర్ 15న విడుదల కానుందని సమాచారం. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ తమిళ సినిమా తెలుగులో మనోహరుడు పేరుతో అనువాదం చేస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ‘అపరిచితుడు’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ‘ఐ’పై ప్రేక్షకులలో భారి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్పులలో కనపించనున్నారు. కొత్త గెటప్’ల కోసం బరువు పెరగడం, తగ్గడం.. ఇలా చాలా శ్రమించారు. ‘ఐ’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమె మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదల తేది త్వరలో వెల్లడించనున్నారు.

Exit mobile version