ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావిస్తాను – లావణ్య త్రిపాటి

Lavanya-Tripathi

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన డెహ్రాడూన్ భామ లావణ్య త్రిపాటి. తను నటించే ప్రతి సినిమా ఫిల్మ్ గా భావిస్తాను అని చెప్తుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్న లావణ్య పెద్ద హీరోల సరసన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. హద్దులలో గ్లామర్ ఒలకబోయడానికి అభ్యంతరం లేదంటోంది. అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలలో నటిస్తుంది.

వైభవ్ సరసన రాజమౌళి అసోసియేట్ జగదీష్ తలశిల దర్శకత్వంలో లావణ్య త్రిపాటి నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాను తెరకేకిస్తున్నారు. ఇది కాకుండా దిల్ రాజు నిర్మిస్తున్న ‘కేరింత’లో సుమంత్ అశ్విన్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తారు. ఈ రెండు సినిమాపై లావణ్య చాలా ఆశలు పెట్టుకుంది.

Exit mobile version