ఓంకార్ తమ్ముడి సినిమాలో హీరోయిన్ గా తేజస్వి

Tejaswi1
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘హార్ట్ ఎటాక్’, ‘మనం’ సినిమాలలో అక్కడక్కడా కనిపించిన తెలుగమ్మాయి తేజస్వి రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. అంతే కాకుండా తేజస్వి హీరోయిన్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే వర్మ – మంచు విష్ణు కాంబినేషన్లో వస్తున్న ‘అనుక్షణం’లో నటించగా, మరో తమిళ సినిమా సెట్స్ పై ఉంది.

గ్లామర్ కి ఎలాంటి హద్దులు పెట్టని ఈ భామ మరో తెలుగు సినిమాకి సైన్ చేసింది. యాంకర్ మరియు డైరెక్టర్ అయిన ఓంకార్ తమ్ముడైన అశ్విన్ చౌదరి హీరోగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాలో తేజస్వి హీరోయిన్ గా నటించనుంది. సాయి రాకేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేసి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. తేజస్వి ఓ ముఖ్య పాత్ర పోషించిన ‘లవర్స్’ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Exit mobile version