మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయిన బాలకృష్ణ

balakrishna1

నందమూరి బాలకృష్ణ అటు ఎమ్మల్యేగా ఇటు నటుడుగా రెండు పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్న టైంలో బాలకృష్ణ కాలికి గాయమైంది. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న బాలకృష్ణ ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు కూడా స్టిక్ సపోర్ట్ తోనే హాజరయ్యారు.

గత కొద్ది రోజులుగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ నేటి నుంచి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ తాజా షెడ్యూల్ నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ప్రస్తుతం బాలకృష్ణ – ఎంఎస్ నారాయణపై కొన్ని కామెడీ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో త్రిష ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా, మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

Exit mobile version