టాప్ లిస్టులో అలరిస్తున్న తమన్ సాంగ్స్

S.Thaman-Image

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా టాప్ హీరోస్ లతో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్.
తను మ్యూజిక్ అందించిన రెండు స్టార్ హీరోల సినిమాల ఆడియో ఇటీవలే విడుదలయ్యాయి. అవే ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’, రవితేజ నటించిన ‘పవర్’. ఈ రెండు సినిమాల్లోని ‘రాకాసి’, ‘నోటంకి’ సాంగ్స్ ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఒక్క వారం కాదు, రిలీజ్ అయిన రోజు నుంచి మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో ఉన్నాయి.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే.. ఈ రెండు పాటలను ఆ సినిమా హీరోలే పాడడం.. ‘రాకాసి రాకాసి’ సాంగ్ ని ఎన్.టి.ఆర్ పాడితే, ‘నోటంకి’ పాటని రవితేజ పాడాడు. ఇలా తను మ్యూజిక్ చేసిన పాటలు మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో ఉండడంతో తమన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇదే విషయం పై ఓ రేడియో చానల్లో ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘తమన్ నా సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మామూలుగా నేను బాత్ రూం సింగర్ ని.. కానీ నా చేత ఫుల్ సాంగ్ పాడించాడు. అంతే కాకుండా అది మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో ఉండడం మరింత ఆనందంగా ఉంది. థాంక్స్ తమన్ అని’ అన్నాడు.

Exit mobile version