‘ముకుంద’కి డబ్బింగ్ మొదలు పెట్టిన వరుణ్ తేజ్

Varun-Tej

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికివరకూ చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు.. అదే కోవలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ముకుంద’. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిరంజీవి బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాకి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. మొట్ట మొదటిసారి డబ్బింగ్ థియేటర్ లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ బాగా ఉత్కంఠకి లోనయ్యారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం సంగీతం అందించిన ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

Exit mobile version