
‘పోటుగాడు’ సినిమా సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని మంచు మనోజ్ మొదలు పెట్టిన సినిమా ‘కరెంట్ తీగ’. ఇటీవలే మొదలయినట్టు ఉన్న ఈ సినిమా షూటింగ్ ని అప్పుడే చివరి దశకు తీసుకువచ్చేశారు. ఇటీవలే ఈ మూవీలోని క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఈ ఎపిసోడ్ కోసం మంచు మనోజ్ రిస్కీ స్టంట్స్ కూడా చేసాడు.
తాజా సమాచారం ప్రకారం ‘గ్రీన్ సిగ్నల్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శిల్పి శర్మ ‘కరెంట్ తీగ’లో ఓ ఐటెం సాంగ్ చేయనుంది. మొదటి సినిమాలోనే తన గ్లామర్ తో ఆకట్టుకున్న శిల్పి శర్మ ఈ స్పెషల్ సాంగ్ లో మాస్ ఆడియన్స్ కి తన గ్లామర్ ట్రీట్ ఇస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ ఐటెం సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అదిరిపోయే మాస్ బీటున్న సాంగ్ ని కూడా కంపోజ్ చేసాడని సమాచారం.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంది. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఆడియో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.