
తెలుగులో అర డజనుకు పైగా సినిమాలలో నటించినా తాప్సికి అదృష్టం కలసిరాలేదు. తన ఖాతాలో హిట్ పర్సెంటేజ్ తక్కువ ఉండడంతో ఐరన్ లెగ్ ముద్ర వేశారు. ఇక లాభం లేదనుకుని హిందీలో తన ఫోకస్ షిఫ్ట్ చేసింది. ఫస్ట్ సినిమా ‘చష్మే బద్దూర్’తో సక్సెస్ కొట్టింది. ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ అనే మరొక సినిమాలో నటిస్తుంది. తాజాగా కిలాడి అక్షయ్ కుమార్ సరసన ‘బేబీ’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
గత ఏడాది అక్షయ్ హీరోగా వచ్చిన ‘స్పెషల్ చబ్బీస్’తో విమర్శకుల ప్రసంశలు అందుకున్న నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బేబీ’ తనకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తీసుకొస్తుందని తాప్సి మంచి నమ్మకంతో ఉంది. హిట్ కాంబినేషన్లో వస్తున్న ‘బేబీ’ ఫస్ట్ లుక్ సోమవారం విడుదల చేశారు. 2015, జనవరి 23న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త సంవత్సరంలో స్టార్ హీరోయిన్ అయిపోతానని కలలు కంటుంది. ‘బేబీ’తో తాప్సి కల నెరవేరుతుందో..? లేదో..? చూడాలి.