‘ఫౌజీ’ కోసం కష్టపడుతున్న టీమ్.. అయినా వెనక్కి వెళ్తుందా..?

fauzi

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వింత ధోరణి నడుస్తోంది. ముందే రిలీజ్ డేట్ ఇచ్చేయడం, ఆ తర్వాత దాన్ని అందుకోవడానికి దర్శకులు, సంగీత దర్శకులు రేయింబవళ్లు కష్టపడటం పరిపాటిగా మారింది. పక్కా ప్లానింగ్ లేకపోవడంతో డేట్లు పదే పదే మారుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి.

​ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ఫౌజీ’ చిత్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. సినిమాను అనుకున్న సమయానికే తీసుకురావాలని దర్శకుడు హను రాఘవపూడి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. షూటింగ్ వేగవంతం చేసేందుకు ఏకంగా రెండు యూనిట్లు రంగంలోకి దిగాయి.

ఒక యూనిట్ కీలక సన్నివేశాలను తీస్తుంటే, సెకండ్ యూనిట్ యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేస్తోంది. అయినప్పటికీ, సినిమా దసరా నుండి డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందనే ఊహాగానాలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి.

Exit mobile version