మైకేల్ జాక్సన్ పై దేవి శ్రీ ప్రసాద్ ట్రిబ్యూట్ వీడియో

devi-sri-prasad
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు ప్రపంచ సంగీత దిగ్గజం, పాప్ మ్యూజిక్ కింగ్ మైకేల్ జాక్సన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సందర్భాలలో తన అభిమానాన్ని చాటుకున్నారు కూడా. సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్లను అందిస్తూ, సరికొత్తగా, ట్రెండీగా ఆలోచించే దేవి… ఈ ఏడాది తన ఫేవరెట్ మైకేల్ జాక్సన్ పుట్టిన రోజు ఎంతో మెమరబుల్ గా ఉండేలా ప్లాన్ చేశారు.

ఆగస్ట్ 29న మైకేల్ జాక్సన్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా – యంజె’ అనే వీడియో ఆల్బంను రూపొందించారు దేవి శ్రీ ప్రసాద్. మైకేల్ జాక్సన్ కు దేవి శ్రీ అందిస్తున్న ట్రిబ్యూట్ వీడియో రేపు అర్ధరాత్రి 12 గంటలకు దేవి శ్రీ ప్రసాద్ అఫీషియల్ యుట్యూబ్ ఛానల్ www.youtube.com/ThisIsDSPMusic లో విడుదల చేస్తున్నారు. టెక్నాలజీతో ముడిపడి ఉన్న పెర్ఫార్మన్స్ తో కూడిన ఈ వీడియోను తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు.

ఇప్పటివరకు చాలా మంది సంగీత దర్శకులు మైకేల్ జాక్సన్ కు నివాళిగా అనేక వీడియోలు రూపొందించారు. వాటికి భిన్నంగా ‘జల్సా – యంజె’ వీడియో ఉంటుది. ఈ ఏడాది నా పుట్టిన రోజు నాడు అమెరికాలో ఉన్నాను. మ్యూజికల్ టూర్ లో భాగంగా న్యూ జెర్సీలో షో చేస్తున్నాను. ఆ రోజు ఈ వీడియో చేశాను. కొత్తగా ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ లిరిక్స్ తో ఈ సాంగ్ ఉంటుంది. అని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు

Exit mobile version