పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరపనున్న చరణ్ అభిమానులు

Pawan-Kalyan-1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాధారణ రీతిలో క్రేజ్ లేదు. ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత ఇండస్ట్రీని వదిలి రాజకీయాలకు వచ్చి మరీ పోటీ చెయ్యకపోవడం అనేది సామాన్యమైన అంశం కాదు. ఆయన ఆలోచనలలో వున్న పారాదర్శకత కారణంగా ఈ రెండేళ్ళలో ఆయన అభిమాన గణం రెండింతలు అయ్యిందని చెప్పొచ్చు

ఈ నేపధ్యంలో సెప్టంబర్ 2న ఆయన జన్మదిన వేడుకలు తమ అభిమానులు ఘనంగా జరపనున్నారు. పవన్ ఇటువంటి వేడుకలకు హాజరుకాకపోయినా ఆయన పేరుమీద సేవా కార్యక్రమాలు చెయ్యడం పరిపాటి. ఈ ఏడాది పవర్ స్టార్ జన్మదిన వేడుకలను రాష్ట్ర రామ్ చరణ్ యువత బేగం పేట్ లో వున్న అక్షయ ఆకృతి ఫౌండషన్ లో జరపనున్నారు. ఇటీవలే జరిగిన చిరంజీవి పుట్టినరోజుకి ఈ సంఘం వేల లీటర్ల బ్లడ్ కలెక్ట్ చేసిన విషయం విదితమే

Exit mobile version