
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా ‘రభస’ అమెరికాలో భారి ఓపెనింగ్స్ సాదించింది. గురువారం జరిగిన ప్రిమియర్ షోల ద్వారా 58 లక్షలు(96K డాలర్స్) కలెక్ట్ చేసింది. ఇదే జోరును శుక్రవారం, శనివారం కూడా కంటిన్యూ చేసింది. ఆగస్ట్ 29న 49 లక్షలు(81K డాలర్స్), ఆగస్ట్ 30న 61.7 లక్షలు (102K డాలర్స్) కలెక్షన్స్ సాదించింది. తొలి రెండు రోజులలో ప్రిమియర్ షోలతో కలపి 1.68 కోట్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా చాటింది.
ఎన్టీఆర్ హైవోల్టేజ్ నటనకు అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఎన్టీఆర్ సరసన సమంత జంటగా నటించిన ఈ సినిమాకు ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రణిత మరొక హీరోయిన్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఆయన తనయుడు గణేష్ బాబు నిర్మించారు.