
చెట్టు పేరు.. జాతి పేరు చెప్పి మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయో.. పండో.. కాదు ‘కరెంట్ తీగ’ అంటూ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చెప్పిన డైలాగ్ కు అద్బుత స్పందన వచ్చింది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ నటిస్తున్న తాజా సినిమా ‘కరెంట్ తీగ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా ఆడియో మరో వారంలో విడుదల చేయనున్నారు. అచ్చు కంపోజ్ చేసిన రాకింగ్ సాంగ్స్ తో త్వరలో అభిమానులకు ‘కరెంట్ తీగ’ ఆడియో షాక్ ఇవ్వనున్నారు.
టీజర్లో మనోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటించింది. సన్నీ లియోన్ పై ఒక ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించారు. ‘సెకండ్ హ్యాండ్’ సినిమా దర్శకుడు కిషోర్ డైలాగ్స్ అందించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు.