ధనుష్ ‘విఐపి’లో రామ్.?

ram-and-danush
ఈ సంవత్సరం తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘వేలఇల్లై పట్టదారి’ సినిమా విడుదలై అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం గట్టి పోటీ జరుగుతోందని ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగు ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్ర హక్కులను దక్కించుకున్నారు.

అలాగే ఈ సినిమాలో ధనుష్ పోషించిన హీరో పాత్రలో రామ్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ రీమేక్ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Exit mobile version