
ఒక మనిషి ప్రత్యక్షంగా చనిపోయినా, పరోక్షంగా అతను మరో రూపంలో బతికి ఉండేలా చేసేదే అవయవదానం.. ఇప్పటి వరకూ ఇండియన్ స్టార్ హీరోస్ అయిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ఐశ్వర్య రాయ్, అసిన్ ఇలా ఎంతో మంది అవయవదాన ప్రతిజ్ఞ చేసి, ఎంతోమందికి అవయవదానం చేయాలని స్పూర్తిని ఇచ్చారు. వీరందరి కోవలేకే తాజాగా టాలీవుడ్ హన్డ్సం హీరో అక్కినేని నాగార్జున కూడా వచ్చి చేరారు.
నాగార్జున అవయవదానం చేయడానికి నిర్ణయించుకున్నాడు. నాగార్జున ఈ అవయవదాన ప్రతిజ్ఞతో పలువురికి స్పూర్తిగా నిలిచి, వారిని కూడా అవయవదానం చేయమని చెప్పడం కోసం సెప్టెంబర్ 13న శిల్పకళ వేదికలో అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నాడు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఇండస్ట్రీలోని పలువురు కూడా అవయవదాన ప్రతిజ్ఞ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నాగ బెటర్ హాఫ్ అయిన అక్కినేని అమల అవయవదానం చేసింది. ఇదేవిధంగా గతంలో కూడా నాగార్జున – అమల కలిసి నేత్ర దానం పై ప్రచారం చేసారు. పలువురికి మేలుచేసే ఇలాంటి వేడుకలు విజయవంతం కావాలని మనము ఆశిద్దాం..