యంగ్ అండ్ ఎనర్జిటిక్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కరెంట్ తీగ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఆ యాక్షన్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మనోజ్ గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి ఓ పాటని రిలీజ్ చేయాలా వద్ద అన్న సంకటంలో ఉన్నాడు. అందుకే సాంగ్ రిలీజ్ చెయ్యాలా వద్దా అన్న ప్రశ్నని ప్రేక్షకులకి ఇచ్చేసాడు. ఎక్కువమంది రిలీజ్ చేయమని కోరడంతో మనోజ్ ఓ సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.
‘కరెంట్ తీగ’ సినిమాలో వచ్చే ‘దేవదాసు’ అనే ఫుల్ బ్రేకప్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటని మంచు మనోజ్ పాడడం విశేషం. ‘మెజారిటీ ప్రకారం రేపు దేవదాసు సాంగ్ ని రిలీజ్ చేస్తున్నాం. ఈ పాటని నేనే పాడాను. ఇదొక బేకప్ సాంగ్ అని’ మనోజ్ ట్వీట్ కూడా చేసాడు.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది.
