ఆరు భాషల్లో విడుదలకానున్న ఆర్తీ అగర్వాల్ సినిమా

Aarthi_Agarwal
మెగాస్టార్ చిరంజీవితో నటించిన ముద్దుగుమ్మఆర్తీ అగర్వాల్ కెరీర్ లో పీక్ టైం లో వున్న దశలో కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కనుమరుగైపోయింది ఆ తరువాత సునీల్ సరసన ‘అందాల రాముడు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా ఆ చిత్రం తరువాత ఆమెకు అనుకునన్ని అవకాశాలు వచ్చి పడలేదు

ప్రస్తుతం భరత్ పారేపల్లి దర్శకత్వంలో నటిస్తున్న ఒక సినిమాలో ఆర్తీఅగర్వాల్ నటిస్తుంది. తీవ్రవాద నేపధ్యంలో నడిచే కధగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ముకుల్ దేవ్, హర్షవర్ధన్ ప్రధాన పాత్రధారులు. ఎవరికో సహాయం చేసిన ఒక కుటుంబానికి కొందరి ద్వారా తీరని కష్టాలు చోటు చేస్కుంటాయి. వారెవరు అన్నది కీలక కధాంశం. విశేషం ఏమిటంటే ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, భోజ్ పురి, బెంగాళి వంటి ఆరు భాషలలో నిర్మిస్తున్నారు.

Exit mobile version