
మరో స్టార్ రైటర్ త్వరలో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ రచయిత గోపి మోహన్ గత కొంత కాలంగా దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా విశేషాలను అధికారికంగా వెల్లడించారు గోపి మోహన్. ఈ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తారు. అనిల్ సుంకర నిర్మాత.
‘సునీల్ హీరోగా అనిల్ సుంకర బ్యానర్ లో నేను దర్శకత్వం వహించే తొలి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కొత్త జోనర్ లో ఈ సినిమా ఉంటుంది ‘ అంటూ సోషల్ మీడియాలో గోపి మోహన్ వెల్లడించారు.
కోనా వెంకట్ తో కలిసి ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘దేనికైనా రెడీ’, ‘బాద్ షా’, ‘బలుపు’, ‘అల్లుడు శీను’ వంటి పలు హిట్ సినిమాలకు గోపి మోహన్ రచయితగా వ్యవహరించారు.