ఇలియానాకి ‘ట్రిపుల్’ బంపర్ ఆఫర్

iliyana
సౌత్ ఇండియాలో వరుస అందుకొని ఫుల్ క్రేజ్ ఉన్న టైంలో ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ లోకి అందుకున్న హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా. ఆ సినిమా విజయంతో సౌత్ కి పూర్తి బ్రేక్ ఇచ్చి ఓన్లీ బాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన ఇలియానా ప్రస్తుతం సైఫ్ ఆలీఖాన్ సరసన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా చేస్తోంది. తాజాగా ఇలియానాకి బంపర్ ఆఫర్ వచ్చింది. అదే ఒకేసారి ముగ్గురు బాలీవుడ్ సూపర్ స్టార్స్ సరసన నటించే అవకాశం కొట్టేసింది.

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఇలియానా యష్ రాజ్ ఫిల్మ్స్ లో సినిమాలు చేయడానికి సైన్ చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఒక హీరోయిన్ ని తీసుకున్నారు నటే తనతో మూడు సినిమాలకన్నా అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. అలాగే ఇలియానా కూడా 3 సినిమాలకు సైన్ చేసింది. అందులో మొదటి సినిమా షారుఖ్ ఖాన్ తో జోడీ కట్టనుంటే, రెండవ సినిమా రన్బీర్ కపూర్ మరియు మూడవ సినిమా సల్మాన్ ఖాన్ సరసన చేయనుంది. ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం ఉందని తెలిపాము. ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం షారుఖ్ సరసన ఇలియానా ఖరారైందని చెప్పవచ్చు.

Exit mobile version