హైదరాబాద్ నగర శివార్లలో ‘గోపాల గోపాల’ సందడి

gopala-gopala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి దేవుడుగా కనిపించనున్న సినిమా ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై వచ్చే సీన్స్ షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్ పై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు.

ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ కిషోర్ పార్ధసాని(డాలీ) ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పెర్ఫార్మన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాలో పవన్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా మెయిన్ రోల్ చేస్తున్నాడు. వెంకటేష్ కి జోడీగా శ్రియ నటిస్తోంది.

‘గోపాల గోపాల’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version