మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామానే పెద్ది. మంచి హైప్ ని ప్రస్తుతం సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల ఈ పాటికే కావాల్సి ఉంది. కానీ ఆలస్యం అయ్యింది. కొత్త డేట్ గా ఏప్రిల్ 30 ఇచ్చారు కానీ ఈ డేట్ కూడా సరిపోకపోవచ్చు అనే రూమర్స్ కూడా లేకపోలేదు.
ఈ నేపథ్యంలో పెద్ది విషయంలో మరో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ మధ్య అంతా పలు సినిమాలు ఆన్ టైం రాకుండా డేట్స్ మారిన సమయంలో తమ ఓటీటీల పరంగా పలు ఇబ్బందులు, డీల్ లో కటింగ్స్ అంటూ కూడా కొన్ని వినిపించాయి. ఇప్పుడు ఇదే పెద్ది విషయంలో కూడా మొదలైనట్లుగా తెలుస్తోంది. పెద్ది సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొన్నారు.
అది కూడా భారీ మొత్తం లోనే. కానీ ఇప్పుడు మళ్లీ డేట్స్ అటు ఇటు అవుతుండడంతో తమ షెడ్యూల్ క్యాలెండర్ పై ఎఫెక్ట్ పడుతుంది అని అనుకున్న సమయానికే అంటే ఏప్రిల్ 30 కే సినిమా వచ్చేలా చూడాలని కోరారు అని టాక్. ఆల్రెడీ ఒకసారి డేట్ మిస్ అయ్యింది. ఇప్పుడు రెండోసారి కూడా మిస్ అయితే ఆ ఎఫెక్ట్ డీల్ పై పడే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. సో బుచ్చిబాబు అండ్ మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
