‘కవచం’లో నటించడం లేదు – యంగ్ హీరో నాని

Nani
తాను ‘కవచం’ సినిమాలో హీరోగా నటించడం లేదు అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు యువ హీరో నాని. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్న ‘కవచం’లో తాను హీరో కాదని స్పష్టం చేశాడు. మొదట ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే, రానా ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో నాని చెంతకు స్క్రిప్ట్ రావడం, ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. షూటింగ్ ప్రారంభం కావడమే తరువాయి అని గాసిప్స్ వెలువడ్డాయి. ఆ పుకార్లకు నాని చెక్ పెట్టారు. హను రాఘవపూడి ‘కవచం’ వేసుకునే హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

నాగ్ అశ్విన్ అనే కుర్రాడు దర్శకుడు పరిచయం అవుతున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో పాటు మరో రెండు సినిమాలలో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సొంతం చేసుకోకపోవడంతో నాని కొత్త సినిమాలపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. తనకు కమర్షియల్ సక్సెస్ అందించే స్క్రిప్ట్ ల కోసం వెయిట్ చేస్తున్నారు.

Exit mobile version