రామ్ గోపాల్ వర్మకి లీగల్ నోటీసు పంపిన శ్రీదేవి

Sridevi-varma
ఎప్పటికప్పుడు తన సినిమాలతో వివాదాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మకి గత కొద్ది రోజులుగా షాక్ ల మీద షాక్ తగులుతున్నాయి. అది కూడా ఓ సినిమా విషయంలో.. ఆ సినిమా పేరే ‘శ్రీ దేవి’. ముందుగా ఈ సినిమాకి సావిత్రి అనే టైటిల్ అనుకున్నారు, కానీ ఆ విషయంపై కేసు రావడంతో ఆ సినిమా టైటిల్ ని ‘శ్రీదేవి’ గా మార్చాడు.

కానీ తాజాగా ఈ ఈ టైటిల్ పై కూడా లీగల్ నోటీసు వచ్చింది వర్మకి, అది పంపింది మరెవరో కాదు ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి.. తను ఎంతగానో ఆరాధించే శ్రీదేవి అలా చేయడంతో వర్మ షాక్ అయ్యాడు. అసలు విషయం ఏమిటంటే శ్రీదేవి తన పర్మిషన్ లేకుండా తన పేరుని, సినిమాకి పెట్టి పబ్లిక్ గా తన పరువు తీస్తున్నాడని అన్నారు. దానివల్ల శ్రీదేవి వర్మపై లీగల్ నోటీసు జారీ చేసింది. మరి ఇప్పుడు ఈ విషయంపై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి.

Exit mobile version