
సుధీర్ బాబు నటిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం గతకొంతకాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ ఎట్టకేలకు షూటింగ్ ముగించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా తెరకెక్కిన విధానంపై సుధీర్ బాబు కాన్ఫిడెంట్ గా వున్నాడు. కన్నడ నుండి రీమేక్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై సుధీర్ బాగానే ఆశలు పెట్టుకున్నాడు
ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత నటిస్తుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమ కధాచిత్రమ్’ మంచి విజయం సాధించింది. కన్నడ వెర్షన్ ని తెరకెక్కించిన చందూ ఈ సినిమాకు దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత