
గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమం ‘స్వచ్చ భారత్ అభియాన్’. ఈ కార్యక్రమం ప్రస్తుతం దేశం అంతా ఒక వైరస్ లా వ్యాపించి అందరూ ఇండియాని క్లీన్ ఇండియాగా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ చాలా మంది స్టార్స్, ఫేమస్ పీపుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి చూపు వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఉంది.
ఇప్పటికే టాలీవుడ్ లో చాల స్టార్స్ ఈ స్వచ్చ భారత్ చాలెంజ్ ని పూర్తి చేసారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి కూడా ఈ చాలెంజ్ వచ్చింది. కానీ అయన ఇంకా ఈ చాలెంజ్ ని తీసుకోలేదు. దాంతో అందరూ పవన్ కళ్యాణ్ స్వచ్చ భరత్ లో పాల్గొంటాడా.? లేదా.? అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ఇంకా స్పందించలేదు. అంతే కాకుండా మోడీని అమితంగా గౌరవించే వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి మోడీ కోసం తనను చాలెంజ్ చేసిన వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొంటాడా లేదా అనేది చూడాలి.
ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఇందాస్త్రీలోని నాగార్జున ఫ్యామిలీ, రామ్, తమన్నా తదితరులు స్వచ్చ భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు స్టార్స్ త్వరలోనే స్వచ్చ భారత్ లో పాల్గొననున్నారు.